అక్కినేని నాగ చైతన్య బంగర్రాజు సినిమాతో హిట్ ఖాతాను రీ ఓపెన్ చేశాడు.. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆ సినిమా 'థ్యాంక్యూ'..భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో చైతూ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా తరువాత చైతూ చేస్తున్న సినిమాల లైనప్ చూసి ప్రేక్షకులు ఆయన నెక్ట్స్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ లైనప్‌లో చైతూ తన నెక్ట్స్ మూవీని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో చేయబోతున్న సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో చైతూ పాత్రపై అభిమానుల్లో టెన్షన్ మొదలైనట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో చైతూ పోలీస్ పాత్రలో నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించాడు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందేమో అని చైతూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. ఆ సేమ్ లైన్ ను రిపీట్ చేస్తె జనాలు బోర్ గా ఫీల్ అవుతారని అభిప్రాయ పడుతున్నారు..


తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా చైతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించ బోతున్నాడట. మరి ఈసారైనా పోలీస్ పవర్‌తో చైతూ సక్సెస్ అందుకుంటాడా లేక తుస్సుమంటాడా అనేది ఈ సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తోంది. ఇక ఈ హీరో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చడ్డా'లో బాలరాజు అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటంతో బాలీవుడ్‌లో ఈ అక్కినేని హీరోకు మంచి గుర్తింపు లభిస్తుందని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి..ఎప్పుడూ కూల్ గా కనిపించే చైతు పవర్ ఫుల్ పాత్రలో ఎలా ఉంటాడో అని చిత్ర వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తోంది..చుద్దాము ఏమౌతుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: