తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల వచ్చిన బీస్ట్ జనాలను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది..అయితే ఇప్పుడు మరో కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..ఆ సినిమానే వారసుడు..ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.. ఈ పోస్టర్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో విజయ్ కనిపించడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..


అయితే తాజాగా ఈ సినిమాలో విజయ్ పాత్రకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విజయ్ లుక్స్ పరంగా చాలా యంగ్‌గా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో విజయ్ కాలేజీ కుర్రాడిగా, ఆ తరువాత ప్రెజెంట్ సీన్స్‌లో ఓ ఫుడ్ కంపెనీ బాస్‌గా విజయ్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో విజయ్ తనదైన వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది..


ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్ కుమార్, శ్రీకాంత్, జయసుధ, ప్రభు, ప్రకాశ్ రాజ్, యోగి బాబు, సంగీతా, సంయుక్తా వంటి స్టార్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండ గా, ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి 'వారసుడు' సినిమా విజయ్ కెరీర్‌లో ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే... విజయ్ కు ఈ సినిమా అన్నా హిట్ ను అందిస్తుందేమో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: