సమంత నాగచైతన్య లు ఎందుకు విడిపోయారో ఒక్క నాగార్జున కు తప్ప మరెవ్వరికి తెలియని సీక్రెట్. దీనిపై అనేక ఊహాగానాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ షోకు అతిధిగా సమంత వచ్చిన నేపధ్యంలో సమంత నాగచైతన్య తో ఎందుకు విడిపోయింది అన్న విషయాలు చెపుతుందని అందరూ భావించారు.


అయితే ఈ టాక్ షోలో సమంత తన తెలివితేటలు ప్రదర్శించింది. నాగచైతన్య తో విడిపోయిన తరువాత ఎదో ఒక సందర్భంలో అనుకోకుండా చైతూ సమంత లు ఒక గదిలో ఏకాంతంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడితే ఏమి చేస్తావు అని కరణ్ జోహార్ అడిగిన ఒక తుంటరి ప్రశ్నకు సమంత చాల తెలివిగా సమాధానం ఇచ్చింది.


ఆగదిలో పదునైన వస్తువులు ఉన్నాయో లేదో తాను కనుక్కుని ఆ గదిలో ఉంటాను అంటూ జోక్ చేసింది. ఈ జోక్ ను లోతుగా విశ్లేషిస్తే అనేక అర్థాలు ఉంటాయి ఈ ఇంటర్వ్యూలో సమంత చైతన్య గురించి మాట్లాడుతూ ‘నా మాజీ భర్త’ అంటూ నొక్కినోక్కి మాట్లాడటం బట్టి సమంత చైతూ ల మధ్య ఏర్పడిన గ్యాప్ ఏ స్థాయిలో ఉందో ఎవరికైనా అర్థం అవుతుంది. చైతూ తో విడాకులు తీసుకున్న తరువాత సమంత స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.


అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోలతో పాటు కొంతమంది బాలీవుడ్ హీరోలతో కూడ నటిస్తూ తెలుగులో విజయ్ దేవరకొండ తో కూడ నటిస్తూ తన స్టామినా ను చూపెడుతోంది. త్వరలో కోలీవుడ్ టాప్ హీరో విజయ్ మూవీలో లేడీ విలన్ గా నటించబోతున్న సమంత కెరియర్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకపోగా పూజా హెగ్డే రష్మిక లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈమె నటించన ‘శాకుంతలం’ ‘యసోదర’ హిట్ అయితే ఇక ఆమె కెరియర్ కు హద్దులు లేవు అనుకోవాలి..  మరింత సమాచారం తెలుసుకోండి: