అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఉప్పెన తోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాల్లో హీరోయిన్ గా నటించిన గొప్ప ఘనతను సాధించింది. ఉప్పెన మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అదిరిపోయే రేంజ్ అవకాశాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చాయి.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో కృతి శెట్టి క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య కు జంటగా కృతి శెట్టి  నటించింది. మంచి అంచనాల నడుమ విడుదలైన బంగార్రాజు సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఉప్పెన  , శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లతో హైట్రిక్ విజయాలను కృతి శెట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి నటించిన ది వారియర్ మూవీ జూలై 14 వ తేదీన తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మినిమం రేంజ్ కలెక్షన్లను రాబట్టడానికి కూడా ఈ మూవీ కాస్త కష్టపడుతోంది. ప్రస్తుతం ది వారియర్  మూవీ పరిస్థితి చూస్తే బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నష్టాలను తెచ్చుకునే లాగానే కనిపిస్తోంది. ఇలా ఉంటే కృతి శెట్టి కి కూడా ది వారియర్ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర మొదటి అపజయం ఎదురయ్యేలా కనిపిస్తోంది. దీనితో పలువురు కృతి శెట్టి కెరియర్ కి ది వారియర్ మూవీ మైనస్ అయినట్లే అని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: