సుకుమార్ దర్శకత్వంలో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన పుష్ప ది రైస్ మూవీ దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. పుష్ప ది రైస్ మూవీ లోని పాటలు ఇప్పటికీ కూడా అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాయి.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమా విజయానికి ఎంతో దోహద పడింది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం  మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం మరికొన్ని రోజుల్లో కానుండగా ప్రస్తుతం సుకుమార్సినిమా లోని మరి కొన్ని ముఖ్యమైన పాత్రల కోసం నటీనటుల వెతుకులాటలో పడినట్లు అందులో భాగంగా ఈ మూవీ లో ఒక ప్రతినాయకుడి పాత్ర కోసం కోలీవుడ్  క్రేజీ నటులలో ఒకరు అయిన విజయ్ సేతుపతి ని తీసుకున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. అలాగే మరో క్రేజీ పాత్ర కోసం ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్ పాయ్ ని కూడా చిత్ర బృందం పిక్స్ చేసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఈ వార్తలపై తాజాగా మనోజ్ బాజ్ పాయ్ స్పందించాడు. పుష్ప ది రూల్ మూవీ కోసం తనను ఎవరూ సంప్రదించలేదు అని , ఆ వార్తలు అన్నీ అవాస్తవం అని తాజాగా ఈ నటుడు తెలియజేశాడు. ఈ నటుడు గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: