టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన నితిన్ తాజాగా మాచర్ల నియోజక వర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

మూవీ లో నితిన్ సరసన క్యాథరిన్ మరియు కృతి శెట్టి లు హీరోయిన్ లుగా నటిస్తుండగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి అంజలి నటించిన స్పెషల్ సాంగ్ 'రా రా రెడ్డి ఐ యామ్ రెడీ' అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 20 మిలియన్ లకు పైగా వ్యూస్ ను మరియు 300 కే కంటే ఎక్కువ లైక్ లను సాధించి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ లో నితిన్ , అంజలి వేసిన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్ లు ఈ సాంగ్ కి ఆకర్షణగా నిలవగా , అంజలి హాట్ హాట్ అంద చందాలు ఈ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: