నాచురల్ స్టార్ నాని తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు . నాని ఎప్పుడు కూడా వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి ముందడుగు వేస్తూ ఉంటాడు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వైవిధ్య మైన పాత్రలో నటించడానికి ఆసక్తి  చూపిస్తూ ఉంటాడు .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని దసరా అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో నాని అదిరిపోయే మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు .  ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా ఆ వీడియో లో నాని అదిరిపోయే మాస్ లుక్ లో కనిపించి అదర గొట్టాడు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో విలన్ పాత్ర లో నటి పూర్ణ కనిపించబోతున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో పూర్ణ విలనిజానికి సంబంధించిన సన్నివేశాలు ఈ మూవీ కే  హైలెట్ గా నిలవ నున్నట్లు సమాచారం . మరి దసరా మూవీ లో పూర్ణ కు సంబంధించిన విలనిజం సన్నివేశాలు ఏ రేంజ్ హైలెట్ గా ఉంటాయో చూడాలి . 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా ,  మహానటి కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దసరా మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: