టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా నటించిన ఐదు సినిమాలు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించాయో తెలుసుకుందాం .

నిన్న అనగా జూలై 22 వ తేదీన నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా విడుదల అయ్యింది . ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు . ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.65 కోట్ల కలెక్షన్లను సాధించింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.06 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.13 కోట్ల కలెక్షన్లను సాధించింది. విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన వెంకీ మామ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.05 కోట్ల కలెక్షన్లను సాధించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన మజిలీ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.6 కోట్ల కలెక్షన్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: