మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. టీజర్ విడుదలైన క్రమంలో దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది. ఆయన హీరోగా నటించిన గత సినిమా ఆచార్య ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడంతో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించగా నయనతార సత్యదేవ్ ఈ చిత్రంలో మెరుస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉండగా అభిమానుల కోసం దీనిని మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారట మెగాస్టార్ చిరంజీవి. తన మేనరిజం దగ్గర నుంచి డ్యాన్సుల వరకు నటన వరకు ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రేక్షకులను తన అభిమానులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను చేశాడట.

ఈ నేపథ్యంలో దసరా కు రాబోయే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత రెండు చిత్రాలను చేస్తున్నాడు చిరంజీవి. వాటిలో ఒకటి మెహర్ రమేష్ దర్శక్వంలోనీ భోళా శంకర్ సినిమా కాగా మరొకటి బాబీ దర్శకత్వంలో తెరెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమా. ఈ రెండు చిత్రాలు కూడా మాస్ లో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ను కలిగి ఉన్నాయి. ఆ విధంగా ఈ మూడు చిత్రాలను ఇదే ఏడాది విడుదల చేయాలని భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత మరికొన్ని సినిమాలను ఒప్పుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. మరి భవిష్యత్ లో ఎవరితో అయన సినిమాలు చేసే అవకాశం ఉందొ చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: