విభిన్నమైన కథలను ఎంపిక చేసుకోవడంలో యువ హీరో అడవి శేషు ముందు వరుసలో ఉంటాడని చెప్పవచ్చు. అడవి శేషు త్వరలో HIT -2 సినిమా  రాబోతోంది.ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడం కాదు ఆలస్యం కావడంతో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడేటట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు సినిమా షూటింగులో అడవి శేషు బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అవుతొందని సమాచారం.

అడవి శేషు మేజర్ సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నారు ఇక ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది.. ఈ సినిమా ప్రమోషన్స్ పనుల కోసం అడవి శేషు దేశవ్యాప్తంగా తిరగడం జరిగింది దీంతో తనకు కాస్త బ్రేక్ కావాలని తెలియజేస్తున్నారు మేజర్ సినిమా విషయంలో ప్రమోషన్ పనుల్లో చాలా కీలకంగా మారారు అడవి శేషు. ఇక మేజర్ చిత్రం మంచి విజయం సాధించడంతో హిట్ -2 సినిమా కోసం అంటే ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక సినిమా షూటింగు అడవి శేషు హాజరు కాలేకపోతున్నానంటూ ఒక లేఖ ద్వారా తెలియజేశారు.సినిమా షూటింగుల సమయంతో బిజీగా ఉన్నాను కాస్త బ్రేక్ కావాలి అని హిట్-2 నుంచి వచ్చే నెలలో సరికొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలియజేశారు మానసికంగా శారీరకంగా చాలా అలసిపోయాను అందుచేతనే ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని రోజులు గ్యాప్ అడిగాను అని తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగును పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తానని అడవి శేషు ఆ లేఖలు రాసుకొచ్చారు. ఇక గతంలో హిట్ -1 లో విశ్వక్సేన్ నటించిన విషయం అందరికీ తెలిసినదే ఇక ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమా థియేటర్లో రిలీజ్ కాకుండా అని ఓటీటి లో విడుదలయ్యింది. అయినా కూడా మంచి విజయాన్ని అందుకుంది అందుచేతనే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కు మరింత క్రేజ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: