ఇక అక్కినేని కుటుంబం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సేవలు అందించిందో చెప్పాల్సిన పనిలేదు. నందమూరి తారక రామారావు తెలుగు సినిమాని ఏలుతున్నవేళ అక్కినేని నాగేశ్వరరావు కూడా తనదైన మార్కుతో చిత్రసీమలో నిలదొక్కుకున్నారు.కానీ సీనియర్ ఎన్టీఆర్ అంత మాస్ ఇమేజ్ ని మాత్రం ఆయన సొంతం చేసుకోలేకపోయారు.ఆయన తరువాత నాగార్జున ఆయన వారసుడిగా అరంగేట్రం చేసాడు. అయితే అప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఓ ఊపు ఊపేస్తున్నాడు.ఇక ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. నాగార్జున తనకంటూ ఓ మార్క్ ని యూత్ లో క్రియేట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ నెంబర్ 1 రేంజ్ కి వెళ్ళాడు. కానీ కొన్ని ప్లాప్స్ అనుభవాల వల్ల కొంచెం తగ్గాడు. ఆ టైం లో మెగాస్టార్ వరుస మాస్ హిట్లతో దూసుకెళ్లాడు. ఇక అప్పుడు నాగార్జున మెగాస్టార్ చిరంజీవిలా మాస్ ఇమేజ్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు.ఇక కింగ్ నాగార్జున తరువాత అతని వారసులు అయినటువంటి నాగ చైతన్య - అఖిల్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. నాగచైతన్య ఇప్పటికే ఓ క్లాస్ హీరోగా టాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యాడు.


క్లాస్ వర్గంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. చైతూ ఇంచుమించు అన్ని జానర్లని టచ్ చేసాడు. కానీ తెరపై లవర్ బోయ్ గా మేజిక్ చేసిన కమర్షియల్ హీరోగా మాత్రం ఎలాంటి మేజిక్ చేయలేకపోయాడు. దాంతో చైతూ కూడా తాత, నాన్నలాగా ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని మాత్రమే రంజింపజేస్తున్నాడు. ఇక అఖిల్ అయితే వరుస ప్లాపులతో ఇంకా వెనకబడే వున్నాడు.అయితే తన ఫ్యామిలీ వున్న బలహీనత దృష్ట్యా కింగ్ నాగార్జున తన వారసులతో ఒక్కరినైనా మాస్ కి చేరువ చేయాలని ఎదురు చూస్తున్నాడు.నాగ చైతన్య-అఖిల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టకుని కథని మల్టీస్టారర్ మౌల్డ్ చేయమని కింగ్ నాగార్జున డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలాకి చెప్పారట. ఇద్దరితో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైననర్ అయితే బాగుంటుందని భావించిన శ్రీకాంత్  అడ్డాల ఇప్పుడు మల్టీస్టారర్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: