అక్కినేని నాగ చైతన్య , రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదల అయ్యి రెండు రోజులు అయ్యింది. బంగర్రాజు సినిమాతో పోలిస్తే ఈ సినిమా పెద్ద హిట్ టాక్ ను అందుకోలేక పోయింది..విడుదలకు ముందు సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో హీరో ఖాతాలో మంచి కలెక్షన్స్ వస్తాయని అందరూ అనుకున్నారు.కానీ అంత పెద్దగా రాబట్టలేక పోయింది..సినిమా ఓ విధంగా మంచి టాక్ ను అందుకుంది..కానీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పొయ్యాయి.


ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునే అంశాలు ఉంటాయని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు భావించారు. కానీ సినిమాలో ఎమోషన్ డోస్ ఎక్కువ కావడం, కమర్షియల్ అంశాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు.అటు తొలిరోజే ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడం కూడా ఈ సినిమాకు మైనస్ పాయింట్ అయ్యింది. దీంతో ఈ ప్రభావం సినిమా వసూళ్లపై పడింది.

ఫస్ట్ డే భారీ వసూళ్లను రాబడుతుందని అనుకన్న థ్యాంక్యూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.16 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. చైతూ కెరీర్ లో ఇటీవల ఇంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'థ్యాంక్యూ' నిలిచింది. ఈ సినిమాలో చైతూ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడుతున్నా, కంటెంట్ పరంగా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని టాక్ వినిపిస్తోంది..ఒకసారి కలెక్షన్స్ చూస్తె..

నైజాం – 0.72 కోట్లు
సీడెడ్ – 0.20 కోట్లు
ఈస్ట్ – 0.14 కోట్లు
వెస్ట్ – 0.08 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.22 కోట్లు
గుంటూరు – 0.10 కోట్లు
కృష్ణా – 0.12 కోట్లు
నెల్లూరు – 0.07 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.06 కోట్లు
ఓవర్సీస్ – 0.45 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.2.16 కోట్లు (రూ.3.70 కోట్లు గ్రాస్).. అనుకున్న ఫలితాలు రాలేదు.. దాంతో చైతూ ఖాతాలో మాత్రం పెద్దగా కలెక్షన్స్ రాలేదు ..


మరింత సమాచారం తెలుసుకోండి: