జబర్దస్త్ ముక్కు అవినాష్ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.. ఓవర్ గా చేస్తూ కొందరి చేత తిట్లు కూడా తింటున్నారు. షో లో అతను చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అవినాష్ చేసేది కామెడీ అని తనలో తాను భ్రమిస్తుంటాడు. అది కామెడీ కాదు.. వెగటు కామెడీ అని అవినాష్‌కు తెలియడం లేదు.బిగ్ బాస్ ఇంట్లో ఉండగా తనకు తాను ఎంటర్టైనర్ అని ప్రకటించుకున్నాడు. అలా స్వయం ప్రకటిత కమెడియన్ అయిపోయాడు. అయితే అవినాష్‌లో కామెడీ యాంగిల్ ఉంది. కానీ అది ఒక్కోసారి హద్దులు దాటుతుంది. బుల్లితెరపై ఇప్పుడు స్టార్ మాలో ఏ ఈవెంట్ చేసినా కూడా అందులో అవినాష్ కనిపిస్తుంటాడు.


తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి స్టార్ మా కింగ్స్ క్వీన్స్ అనే ఈవెంట్ చేశారు. ఇందులో అవినాష్ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ బ్యూటీలైన దివి, ప్రియాంక సింగ్‌లతో రెచ్చిపోయాడు.నువ్ నిజంగా క్వీన్ అయితే.. నీకు దమ్ముంటే.. నన్ను హగ్ చేసుకో అని అవినాష్ సవాల్ విసురుతాడు. అవినాష్‌ చాలెంజ్‌కు ప్రియాంక రెచ్చిపోతుంది. అవినాష్‌ను తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చిన్న పిల్లాడిని వదిలెయ్.. దడుసుకున్నట్టున్నాడు అని అందరూ అంటారు. కానీ అవినాష్ మాత్రం.. బాగుందన్నా అంటూ ఇంకా కావాలన్నట్టుగా చూస్తాడు..


ఆ తర్వాత కొన్ని సందర్భాలలో దివిని కోరుకుంటాడు. మీరు నిజంగా క్వీన్స్ అయితే నాకు దివిని ఇచ్చేయండని అంటాడు. ఏం లేదు.. డ్యాన్స్ పర్ఫామెన్స్ చేద్దామని అడుగుతున్నాను అని కవర్ చేస్తాడు. ఆ తరువాత దివితో కలిసి రొమాంటిక్ స్టెప్పులు వేస్తాడు. ఇక మరో వైపు దివి అయితే సీసా అంటూ ఐటం సాంగ్‌కు స్టెప్పులు వేస్తుంది. ఇంకో సందర్భంలో అవినాష్ మరింత ముందుకు వెళ్తాడు. మీరు నిజంగా క్వీన్స్ అయితే.. అందరూ నాకు ముద్దులు పెట్టండి అని కోరుకుంటాడు.అలా అవినాష్ ప్రతీ సందర్భంగా అతిని ప్రదర్శిస్తుంటాడు. అవినాష్ చేసిందే కామెడీ అని స్టార్ మా అనుకుంటూ ఉంటోంది కాబోలు. ఇక ఈ ప్రోమోలో మాత్రం దివి, సిరి, భాను వేసిన రొమాంటిక్ స్టెప్పులు అదిరిపోయాయి. చివర్లో రవి, సన్నీ గొడవ ఏంటన్నది చూడాలి...ఏది ఏమైనా కూడా అతని ఓవర్ యాక్షన్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: