తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క పేరు తెలియని వాళ్ళు ఉండరెమో..ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రను తిరగ రాసింది..ఈ అమ్మడు ప్రస్తుతం కాస్త సినిమాలని తగ్గించి ఇంటి పట్టునే ఉంటుంది.కొన్నాళ్లుగా ఆమె పెళ్లికి సంబంధించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అనుష్క శెట్టి తన వృత్తిలో డెడికేటెడ్ గా వర్క్ చేస్తుందని.. ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే.. సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని.. సినిమా రంగానికి చెందిన వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకుంటుందని చెప్పారు. అనుష్క కచ్చితంగా సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని అంటే.. బయట వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు.


అలాగే ఆమె 2023 లోపు పెళ్లి చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. దీంతో ఇందులో ఎంత నిజం ఉందనేది అనే దానిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అనుష్కకి పెళ్ళి ఖరారైందనీ, బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామిక వేత్తని అనుష్క పెళ్ళాడబోతోందనీ తాజాగా ఓ వార్త తెరపైకొచ్చింది. ఈసారైనా ఈ ప్రచారం నిజమవుతుందా.? లేదంటే, ఇది కూడా గాసిప్‌గానే మిగిలిపోతుందా.? ఏదిఏమైనా, అనుష్క పెళ్లి అంటే సోషల్ మీడియాలో హంగామా ఓ రేంజ్‌లో ఉండక మానదు. కాగా, ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లలో చాలా సీనియర్ స్టార్ అనుష్క.. ఈమె ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె ఇండస్ట్రీకి కొంత దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది..


నిశ్శబ్దం సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు తర్వాత ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఆమెతో సినిమా చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్న ఆమె మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదట. అయితే తాజాగా యు.వి వాళ్లు అధికారికంగా ఆమెతో ఒక మూవీ అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా మహేష్ అనేది డైరెక్షన్ లో అనుష్క కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం..ఈ నెలలో అనుష్క సినిమా మొదలు కానుంది.మరి ఆ సినిమా ఎలా ఉందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: