టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ నటులలో ఒకరు అయిన నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.  ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.  

మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి ఎన్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా , నితిన్ సరసన ఈ మూవీ లో క్యాథరిన్ మరియు కృతి శెట్టి లు హీరోయిన్ లుగా నటించారు.  అలాగే ఈ మూవీ లోని ఒక స్పెషల్ సాంగ్ లో అంజలి కూడా నటించింది. ఇప్పటికే అంజలి నటించిన స్పెషల్ సాంగ్ ని మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ సినిమా నుండి మూవీ యూనిట్ అదిరింది అనే మరో సాంగ్ ని కూడా విడుదల చేసింది. ఈ సాంగ్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో మాచర్ల నియోజకవర్గం మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లో ను మరింత వేగవంతం చేయనుంది.

అందులో భాగంగా  మాచర్ల నియోజకవర్గం మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్ డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బృందం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జూలై 30 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఎల్ ఈ ఎం స్కూల్ గ్రౌండ్ బ్రోడిపేట్ , గుంటూర్ లో నిర్వహించనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను రాజకీయ నేపథ్యం కలిగిన కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: