కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ట డైరక్షన్ లో వస్తున్న సినిమా బింబిసార. చారిత్రక కథతో వస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై ఆడియెన్స్ ని మెప్పించింది. బాహుబలి తరహాలో కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ఉండబోతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా బాగా కష్టపడ్డారని తెలుస్తుంది. సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ త్రెసా, సం యుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఆగష్టు 11న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవనుంది.

అయితే బింబిసార కథ డైరక్టర్ వశిష్ట ముందు మాస్ మహరాజ్ రవితేజ దగ్గరకు తీసుకెళ్లాడట. రవితేజకి కథ నచ్చినా సరే కొన్ని కారణాల వల్ల సినిమా వదులుకోవాల్సి వచ్చిందట. అదే కథని కళ్యాణ్ రామ్ కి చెప్పి ఒప్పించాడు డైరక్టర్ వశిష్ట. కళ్యాణ్ రామ్ కెరియర్ లో బింబిసార ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని చెప్పొచ్చు. టీజర్ తోనే సినిమాలో విషయం ఉంది అన్నది అర్ధమవుతుంది.

ఒకవేళ రవితేజ చేసినా సరే బింబిసార మీద ఇదే రేంజ్ అంచనాలు ఉండేవి. మాస్ మహరాజ్ రవితేజ ఇలాంటి హిస్టారికల్ మూవీ ఎప్పుడూ చేయలేదు. ఈ సినిమా చేసుంటే కెరియర్ లో ఫస్ట్ టైం ఈ అటెంప్ట్ చేసినట్టు ఉండేది. ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే ఈ నెల చివర్లో రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటుగా త్రినాథ రావు డైరక్షన్ లో ధమాకా కూడా చేస్తున్నాడు రవితేజ. ఆ సినిమా కూడా ఈ ఇయర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ మార్క్ ఎంటర్టైనింగ్ తో ఆ మూవీ వస్తుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ధమాకా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: