ఆఫ్టర్ డైవర్స్ మరింత స్ట్రాంగ్ గా మారిన సమంత ఓ పక్క తన ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టగా కేవలం ఇలాంటి పాత్రలే చేయాలి అన్న ఆలోచన కూడా పక్కన పెట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకే ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ సెకండ్ సీజన్ లో నెగటివ్ రోల్ లో మెప్పించింది సమంత. ఆ పాత్ర ఇచ్చిన ప్రోత్సాహంతో మరోసారి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో తన సత్తా చాటాలని చూస్తుంది సమంత. ప్రస్తుతం వెబ్ సీరీస్ లు సినిమాలతో కెరియర్ సూపర్ బిజీ చేసుకున్న సమంత విజయ్ 67వ సినిమాలో కూడా నటిస్తుంది.

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్టర్ మాస్టర్ ఈ కాంబో మూవీపై మరింత క్రేజ్ ఏర్పడింది. అదీగాక విక్రం తో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరక్టర్ లోకేష్ కనగరాజ్ విజయ్ తో చేస్తున్న సినిమాతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు కానీ విలన్ గా మాత్రం సమంతని ఫిక్స్ చేశారు. విజయ్ కి విలన్ గా సమంత ఏంటని ఆశ్చర్యపోవచ్చు. సమంత ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో చేస్తుందని తెలుస్తుంది. సమంత ఈ పాత్ర కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉందని అంటున్నారు.

తనకు ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా సరే న్యాయం చేసే సమంత దళపతి విజయ్ 67వ సినిమా కోసం పూర్తిస్థాయిలో నెగటివ్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఈ పాత్రలో సమంత చాలా స్పెషల్ గా కనిపించబోతుందని అంటున్నారు. ఖచ్చితంగా సినిమాలో సమంత పాత్ర అందరిని ఆకర్షిస్తుందని టాక్. తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలను పూర్తి చేసిన సమంత విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తుంది. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: