బిగ్ బాస్ సీజన్ 6 రెడీ అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టంట్స్ ని సెలెక్ట్ చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. సీజన్ 6 కోసం ఇప్పటికే కొంతమందిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. వీరిలో టాలీవుడ్ హీరోలు.. డ్యాన్స్ మాస్టర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరోపక్క ఈసారి సీజన్ కి స్టార్ యాంకర్ ఉదయభానుని తీసుకు రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. బిగ్ బాస్ టీం ఒకటి రెండు సీజన్లుగా ఉదయభాను కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఆమె మాత్రం అందుకు నో చెబుతుందని తెలుస్తుంది.

ఒకప్పుడు బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఉదయభాను ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డది. పెళ్లి.. పిల్లలు తర్వాత కెరియర్ లో గ్యాప్ తీసుకున్న ఉదయభాను ఈమధ్య మళ్లీ వరుస ఈవెంట్లతో సందడి చేస్తుంది. ఇక ఈ టైం లో తన పాపులారిటీ మరింత పెంచుకోవాలని చూస్తుంది ఉదయభాను. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ ఛాన్స్ కూడా వచ్చిందట. ఉదయభాను మాత్రం షోలో కొన్ని టాస్క్ లలో వ్యక్తిగత విషయాల పట్ల చెప్పాల్సి ఉంటుంది. అది ఇష్ట లేకనే ఉదయభాను బిగ్ బాస్ లోకి వెళ్లలని అంటుంద్దట.

అయితే బిగ్ బాస్ టీం మాత్రం ఉదయభానుకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. ఆమె అడిగినంత ఇచ్చి ఈసారి ఆమెని హౌజ్ లోకి తీసుకు రావాలని చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6లో ఉదయభాను వస్తే మాత్రం తప్పకుండా షోకి స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చినట్టే. మరి ఉదయభాను బిగ్ బాస్ కి వెళ్లేందుకు ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టంట్స్ వీరే అంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ హడావిడి చేస్తున్నాయి. అయితే అవేవి వాస్తవం కాదని చెప్పొచ్చు. బిగ్ బాస్ టీం కొందరిని ఫైనల్ చేసినా సీజన్ 6 ఫైనల్ కంటెస్టంట్స్ ఎవరన్నది ఇంకా లీక్ అవలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: