నాగ చైతన్య వరుసగా లవ్ స్టోరీ , బంగార్రాజు వంటి మంచి విజయాల తర్వాత తాజాగా థాంక్యూ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలెంటెడ్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా ,  దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రాశి ఖన్నామూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు.  

సినిమా జూలై 22 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది.  ప్రస్తుతం థాంక్యు సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. రెండు రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
 
నైజాం : 98 లక్షలు ,
సీడెడ్ : 28 లక్షలు ,
యూ ఏ : 35 లక్షలు ,
ఈస్ట్ : 20 లక్షలు ,
వెస్ట్ : 12 లక్షలు ,
గుంటూర్ : 15 లక్షలు ,
కృష్ణ : 17 లక్షలు ,
నెల్లూర్ : 10 లక్షలు , రెండు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో థాంక్యూ మూవీ 2.35 కోట్ల షేర్ 3.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రేట్ ఆఫ్ ఇండియా లో : 10 లక్షలు .
ఓవర్ సీస్ లో : 65 లక్షలు .
రెండు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా థాంక్యూ మూవీ 3.10 కోట్ల షేర్ , 5.35 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో థాంక్యూ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: