సినిమా అఖిల్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అన్నారు. అంతేకాదు ప్రతి హీరో కెరియర్ లో ఒక సినిమా ఆల్ టైం ఫేవరెట్ గా ఉంటుందని. అఖిల్ కెరియర్ లో ఏజెంట్ కూడా అలాంటి సినిమానే అని అంటున్నారు అనీల్ సుంకర. అఖిల్ కెరియర్ ని నెక్స్ట్ లెవల్ లో తీసుకెళ్లే సినిమా ఏజెంట్ అని అంటున్నారు అనీల్ సుంకర. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఏజెంట్ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరియర్ లో ఫస్ట్ టైం కమర్షియల్ హిట్ అందుకున్న అఖిల్ ఆ హిట్ మేనియాని కొనసాగించాలని చూస్తున్నాడు. అఖిల్ ఏజెంట్ సినిమా మాత్రం అతని కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని టాక్. మరి ఈ సినిమా అఖిల్ కు కోరుకుంటున్న హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి. సైరా నరసింహా రెడ్డి తర్వాత అఖిల్ చేస్తున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలు ఏర్పరచుకున్నారు. ఈ సినిమా ఏ రేంజ్ లో సత్తా చాటుతుందో చూడాలి. అఖిల్ మాత్రం తన మాస్ మేకోవర్ తో దుమ్ముదులిపేయాలని చూస్తున్నాడు. టీజర్ లో అతని యాటిట్యూడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.