మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఒకప్పటి హీరో వేణు తొట్టేంపూడి. ఈ నెల 29న రిలీజ్ అవుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ కి నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు.

ఇక ఈవెంట్ లో వేణు మాట్లాడుతూ సినిమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న తనని డైరక్టర్ శరత్ మండవ లాక్కొచ్చి మరి ఈ సినిమా చేయించారని. అందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు. హీరో రవితేజ కూడా ఈ పాత్రకు తనని సజెస్ట్ చేయగానే ఆయన కూడా సూపర్ అనేశారట. ఆయనకు థ్యాంక్స్ అని చెప్పారు వేణు. ఈవెంట్ లో వేణు మాషప్ చూపించారు. దాన్ని ఉదహరిస్తూ అదంతా పోయిన జన్మ.. ఇప్పటి నుంచి మరో జన్మ.

ఇక ముందు మాదిరిగానే ఇక వరుస సినిమాలు చేయాలని అనుకుంటున్నానని అన్నారు వేణు. అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలని గతంలో తనని ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలానే తనని ఆదరించాలని కోరారు. రవితేజ గారి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. దమ్ము సినిమా తర్వాత దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వేణు తొట్టెంపూడి సరైన ఛాన్స్ కోసం వెతుకుతున్నారు. శరత్ మండవ తనకు సూటయ్యే పర్ఫెక్ట్ రోల్ తో రావడంతో ఆయనకి వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమా హిట్టైతే మాత్రం వేణుకి వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: