క్రిష్ డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. 17వ శతాబ్ధం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ కెరియర్ లో ఎప్పుడూ చూడని కొత్త లుక్ తో కనిపించనున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా పవన్ డేట్స్ వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇంకా కొంతభాగం షూట్ చేయాల్సి ఉందని తెలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ కి సంబందిచిన సీన్స్ అన్ని షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం పవన్ ఆగష్టు 11 నుంచి కేటాయించారట. సో హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూ ఆగష్టు 11న స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూఒల్ లో ఒక సాంగ్ తో పాటుగా పవన్ కళ్యాణ్ సీన్స్ అన్ని పూర్తి చేస్తారని తెలుస్తుంది. పవన్ ఇచ్చిన డేట్స్ లో సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నారు క్రిష్. పవన్ సీన్స్ అన్ని పూర్తి కాగానే మిగతా వారితో సినిమాని త్వర త్వరగా పూర్తి చేసే ఆలోచనల్లో ఉన్నారు.

హరి హర వీరమల్లు సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో జాక్వెలిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కానీ షూటింగ్ జరుగుతున్న విధానం చూస్తుంటే మాత్రం సినిమా అనుకున్న టైం కి రిలీజ్ చేయడం కష్టమని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమా పూర్తి చేసి తన రాజకీయాల మీద పూర్తి ఫోక్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరోపక్క మరో తమిళ సినిమా వినోదయ సీతం సినిమాకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ సినిమాని మాత్రం 2023 లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: