తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటగా ఐరన్ లెగ్ అనే పేరు పొందిన శృతిహాసన్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఆ తర్వాతే ఈమెకు ఎన్నో వరుస సినిమా ఆఫర్లు వచ్చి మంచి విజయాలను అందుకుంది. అయితే శృతిహాసన్ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. అయితే తన ఇండస్ట్రీకి వచ్చి కేవలం 13 ఏళ్లు పూర్తి అయ్యిందట. మొదట 2009 యాక్షన్ త్రిల్లర్ లక్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమయ్యింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో భాగ్యలక్ష్మి పాత్రల బాగా ఆకట్టుకుంది.

శృతిహాసన్ పలు బ్లాక్ బస్టర్ మూవీలలో నటించి పూర్తి స్థాయిలో అందరిని మెప్పించింది అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు సీనియర్ హీరోలతో కూడా నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా నటిస్తోంది. తాజాగా శృతిహాసన్ తన ఇన్స్టాగ్రామ్ నుండి ఒక లెటర్ ని విడుదల చేసింది. అందులో ఆకట్టుకునే విధంగా ఒక లెటర్ ని రాయడం జరిగింది. ఆమె సినీ రంగ ప్రయాణం ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. మ్యాజికల్ 13 సంవత్సరాలు నేను సినీ ఇండస్ట్రీలో ఇంతకంటే ఎక్కువ సంవత్సరాలు చేస్తానని ఎప్పుడూ కూడా అనుకోలేదు. సినిమా అనేది నా ఆనందానికి గొప్ప వరంలా మారింది.

ఈ రంగం నాకు ఎంతో కృతజ్ఞతతో కూడింది.. నేను జయ అపజయాలను ఎన్నో ఎదుర్కొన్నాను వాటిని ఆత్మవిశ్వాసంతో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాను అన్నిటికంటే ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నాను అని తెలియజేసింది. ఈ చిత్ర విచిత్రాలు ఉండడమే కాకుండా 13 సంవత్సరాలు తన లైఫ్ని సినీ ఇండస్ట్రీలో విజయవంతం చేసినందుకు తెలియజేసింది. దీంతో ఆమె నా వయసు ఇంకా 13 అని తెలియజేసింది. అయితే తన వ్యక్తిగత వ్యవహారంపై ఎలాంటి క్లూ కూడా ఇవ్వలేదు శృతిహాసన్ దానికి కారణం కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: