ఇటీవలి కాలంలో ఎంతో మంది స్టార్ హీరోలు సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుతూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం స్టార్ హీరోల రెమ్యునరేషన్ డబుల్ అయ్యింది. ఇకపోతే ఇటీవలి కాలంలో హీరోలు మాత్రమే కాదు కొంతమంది హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో మొదటి వరుసలో ఉంటుంది నయనతార.


 ఒకప్పుడు ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మైమరిపింప చేసిన నయనతార ఇక ఇటీవల కాలంలో మాత్రం కేవలం నటనకు  ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటుంది. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయనతార. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో కూడా నటిస్తూ అంతకంతకు అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు ఈ అమ్మడు. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఇప్పటికే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతారా.


 ఇక ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కూడా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది అన్నది తెలుస్తుంది. పెళ్లి కారణంగా కొన్నాళ్ల  వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నయనతార మళ్ళీ ఇప్పుడు బిజీ అయ్యేందుకు సిద్ధమైంది. అయితే ఇటీవలే నీలేష్ డైరెక్షన్లో 75వ సినిమాగా రూపొందుతున్న మూవీ కి నయనతార ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్న మొట్ట మొదటి హీరోయిన్ గా నయనతార రికార్డు సృష్టించబోతుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే ఇటీవలే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది నయనతార. గత కొంత కాలం నుంచి నయనతార సినిమాలకు ఒక రేంజ్ లో డిమాండ్ వున్న నేపథ్యంలో ఇక దర్శక నిర్మాతలందరూ కూడా లేడీ ఓరియెంటెడ్ స్టోరీలతో నే ఈ అమ్మడిని అప్రోచ్ అవుతూ ఉండడం గమనార్హం. 

ఒకవేళ ఇదే నిజమైతే.. నయనతార రాంగ్ స్టెప్ వేసింది అని అంటున్నారు  సినీ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఇలా పారితోషకం  భారీగా పెంచిన హీరోయిన్లను దర్శక నిర్మాతలు పక్కన పెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇప్పుడూ మంచి ఫామ్ లో ఉన్న నయనతారా ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే నిర్మాతలు ఇక ప్రత్యామ్నాయ హీరోయిన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని తద్వారా నయనతారకు ఆఫర్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: