బాలీవుడ్ నటులైన అమీర్ ఖాన్ మరియు కరీనాకపూర్ జంటగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చద్దా. అయితే వయాకామ్ 18 స్టూడియోస్‌, పారామౌంట్‌ పిక్చర్స్ తో కలిసి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో అమీర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు.ఇకపోతే ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా సందడి చేశారు. కాగా ఈ సినిమాలో నాగచైతన్య అమీర్ ఖాన్ స్నేహితుడి పాత్రలో సందడి చేయనున్నారు.ఇదిలావుంటే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. అయితే ఇక ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు. 

ఇక ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో ప్రివ్యూ చూసిన అనంతరం సినిమా ఎంతో అద్భుతంగా ఉన్నట్టు అమీర్ ఖాన్ ను హగ్ చేసుకుని అతనిపై పొగడ్తల వర్షం కురిపించడమే కాకుండా ఈ సినిమాని తాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పోతే ఈ సినిమా వచ్చే నెల 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.కాగా ఇందులో నటిస్తున్నటువంటి నాగచైతన్య కూడా థాంక్యూ సినిమా విడుదల కావడంతో ఫ్రీ అయ్యారు. అయితే ఇకపై ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో నాగచైతన్య బిజీగా ఉన్నారు.

 ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలావుంటే ఈ సినిమా థియేటర్లో విడుదలయి కొన్ని వారాలకు నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.ఇక ఇలా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఈ చిత్ర బృందం నుంచి లేదా మేకస్ నుంచి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు త్వరలోనే ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: