టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నా కొరటాల శివ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివ ఎన్నో విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరుగా కొనసాగుతున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే .

మంచి అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది . కొరటాల శివ కెరియర్ లో ఆచార్య సినిమాని మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి . ఇలా ఆచార్య సినిమాతో అపజయాన్ని ఎదుర్కొన్న కొరటాల శివ మరి కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం కాబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మరో హీరో తో మూవీ ని లైన్ లో పెట్టె పనిలో కొరటాల శివ ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ , ఎన్టీఆర్ తో సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమాను చేయాలి అని ప్లాన్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం కొరటాల శివ , అల్లు అర్జున్ కోసం కూడా అదిరిపోయే కథ సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: