మాలీవుడ్ హీరో  దుల్కర్ సల్మాన్  ప్రతి ఒక్కరికి సుపరిచితమే తెలుగులో పలు డబ్బింగ్ సినిమాలను విడుదల చేసి మంచి పేరు సంపాదించారు. ఇక తాజాగా దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ఒక ప్రేమ కథ అని దీనికి ఉప శీర్షికగా రాయడం జరిగింది ఈ చిత్రాన్ని రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సినిమాని నిర్మించడం జరిగింది తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో ఒకేసారి ఈ సినిమాని ఒకే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.


ఇక ఈ రోజున సాయంత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు అందుకు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా అభ్యంతరం ఆసక్తికరంగా ఎమోషనల్ గా సాగి ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. సీతారామం అనే యుద్ధ నేపథ్యంలో  బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ అన్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది ఈ ట్రైలర్లో రామ్ మరియు సీతాల మధ్య ప్రేమ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇక ఇందులో రష్మిక చాలా కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.ఇక ట్రైలర్ లో చూపించిన విధంగా రస్మిక ఒక లెటర్ పట్టుకొని రామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.. ఇక 1965 లెఫ్ట్నెంట్ గా ఉన్న రామ్ మరియు సీతాల మధ్య ఒక అందమైన ప్రేమ కథ నడిచిందని విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలా ప్రేమించుకుంటున్న సమయంలో వీరు లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల వీరిద్దరూ విడిపోవడం జరుగుతుంది. అయితే ఇందులో రష్మిక చెప్పే డైలాగులు చాలా సింపుల్గా ఎమోషనల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రష్మికలెటర్ ను సీతామహాలక్ష్మికి అందిస్తుందా లేదా అన్న విషయం తెలియాలి అంటే ఆగస్టు-5  వరకు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: