టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య లవ్ స్టోరీ , బంగార్రాజు వంటి మంచి విజయవంతమైన సినిమాల తర్వాత టాలెంటెడ్ దర్శకుడు అయిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా కథానాయికగా నటించింది. ఈ మూవీ లో నాగ చైతన్య మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటించి మెప్పించాడు.

సినిమా మంచి అంచనాల నడుమ జూలై 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే థాంక్యూ మూవీ కి మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర కాస్త నెగిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ కలెక్షన్ లను మాత్రం అందుకోలేకపోతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మూడు రోజులకు గాను థాంక్యూ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 1.15 కోట్లు , సీడెడ్ : 32 లక్షలు , యూ ఏ : 42 లక్షలు , ఈస్ట్ : 23 లక్షలు , వెస్ట్ : 14 లక్షలు , గుంటూర్ : 18 లక్షలు , కృష్ణ : 20 లక్షలు , నెల్లూర్ : 11 లక్షలు , 3 రోజుల బాక్సాపీస్ థాంక్యూ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 2.75 కోట్ల షేర్ , 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 11 లక్షలు .
ఓవర్ సీస్ లో : 74 లక్షలు .
మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా థాంక్యూ మూవీ 3.60 కోట్ల షేర్ ,  6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: