బోయపాటి శ్రీను సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనతో సినిమాలు చే యాలని ప్రతి ఒక్క
హీరో కూడా కలలు కంటూ ఉంటాడ. ముఖ్యంగా
మాస్ ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి
బోయపాటి శ్రీను చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్న చాలా మంది
మాస్ హీరోలు ఆయనతో సినిమాలు చేసి
మాస్ లో విపరీతమైన క్రేజ్ అందుకున్న వారే. ఆ విధంగా ఇటీవల
బాలకృష్ణ తో ఆయన చేసిన అఖండ
సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించింది.
చాలా రోజుల తర్వాత
బాలకృష్ణ కు అఖండ విజయాన్ని తెచ్చి పెట్టిన ఈ
సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం
బోయపాటి శ్రీను అనే చెప్పాలి. కథ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఈ సినిమాను తెరకెక్కించాడు. అలా సంచలన విజయాన్ని అందుకున్న
బోయపాటి శ్రీను ఇప్పుడు
రామ్ హీరోగా మరొక ఊరమాస్ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు.
త్వరలోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుండగా ఇటీవలే
రామ్ హీరోగా నటించిన
వారియర్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడంతో ఈసారి
బోయపాటి శ్రీనుతో చేస్తున్న
సినిమా మంచి విజయం అందుకోవాలని ఆయన భావిస్తున్నాడు. మరి
బోయపాటి ఏ విధమైన సినిమా ను
రామ్ తో చేస్తాడు చూ డాలి.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ప్రేక్షకులను ఆ స్థాయిలో
రామ్ అలారించలేక పోయాడు. మరి ఇప్పుడు చేసే సినిమాలతో ఆయన మళ్ళీ ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. ఈ
సినిమా తర్వాత కూడా ఆయన ఓ
తమిళ దర్శకుడితో
సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్న అయన ఈ
సినిమా తో ఏ స్థాయి లో ఆకట్టుకుంతాడో చూడాలి మరి.