సినిమా పరిశ్రమలో అందరికంటే ఎక్కువగా హీరోల డామినేషన్ ఉంటుంది. ఏ చిత్రం విడుదలైనా కూడా హీరోకి ఎక్కువగా పేరుస్తూ ఉంటుంది. వారికే అభిమానులు కూడా గట్టిగా ఏర్పడుతూ ఉంటారు పాపులారిటీ వైడ్ గా డబ్బుపరంగా అన్నిటికీ పరంగా కూడా వీరికే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ట్రెండును ఇప్పుడు మారుస్తూ కొంతమంది దర్శకులు తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు.  తమకు ఉన్న ఇమేజ్ తో ప్రేక్షకులను అలరిస్తూ వీరు ఫుల్ ఫాం లో ఉన్నారు. వీరికి హీరోలకు తగ్గట్లుగా అభిమానులు ఉన్నారు అంటే మాములు విషయం కాదు. 

హీరోలకు మాత్రమే కాదు దర్శకులకు కూడా స్టార్ డం వస్తుందని నిరూపించిన డైరెక్టర్ లలో మొదటగా మనం రాజమౌళి గురించి చేపుకోవాలి. . ఆయన సినిమాలలో ఎక్కువ భాగం క్రెడిట్ హీరోలకు కాకుండా దర్శకుడికే దక్కుతుంది. అలా తొలి సినిమా నుంచి ఇప్పటివరకు హీరోలను మించిన క్రేజ్ తో సినిమాలు విడుదల చేస్తూ ఉంటాడు. ఆ తరువాత కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ హీరోకి సమానంగా పాపులారిటీని అందుకొని ఇప్పుడు మరింతగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

తాజాగా పుష్ప సినిమాతో తన ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఈ దర్శకుడు పుష్ప 2 తో హీరో కంటే ఎక్కువగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.  ఇకపోతే ఆయన తదుపరి సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి అంటే దానికి సగం కారణం సుకుమార్ అనే చెప్పాలి. తాజాగా విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న దర్శకుడు లోకేష్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఆ సినిమా అంతటి పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం లోకేష్ అనే చెబుతున్నారు. మరి భవిష్యత్తులో హీరోలను మించిన క్రేజ్ తో దర్శకులు ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: