యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే రామ్ పోతినేని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు . ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రామ్ పోతినేని తన కెరియర్ లో కూడా కొన్ని మూవీ లను కూడా వదులుకున్నాడు . మరి రామ్ పోతినేని రిజెక్ట్ చేసిన సినిమాల గురించి తెలుసుకుందాం .

నాచురల్ స్టార్ నాని హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా కథ ముందుగా రామ్ పోతినేని వద్దకు రాగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రామ్ పోతినేని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది . ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని సాధించింది . జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత , ప్రణీత హీరోయిన్ లుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రభస సినిమా కథ ముందుగా రామ్ పోతినేని వద్దకే వచ్చినట్లు తెలుస్తుంది , కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ని రామ్ పోతినేని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది .


సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయింది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన రాజా ది గ్రేట్ మూవీ కథ మొదటగా రామ్ పోతినేని వద్దకు రాగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రామ్ పోతినేని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది . ఈ సినిమా బాక్సా  ఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించింది . ఇలా రామ్ పోతినేని తన కెరియర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: