నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో కృతి శెట్టి మరియు క్యాథరిన్ లు నితిన్ సరసన హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి  ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ లో సముద్ర కని ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు . 

ఇప్పటికే సముద్ర కని కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా సముద్ర ఖని ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గం సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ లను ఇప్పటికే ప్రారంభించింది.  అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను కూడా మూవీ యూనిట్ విడుదల చేయగా ఆ రెండు సాంగ్స్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

అలాగే రేపు అనగా జూలై 26 వ తేదీన ఉదయం 11 గంటల 3 నిమిషాలకు మాచర్ల నియోజకవర్గం మూవీ నుండి మాచర్ల దంకి ని విడుదల చేయను న్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మాచర్ల నియోజకవర్గం మూవీ తో నితిన్ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: