బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చేసిన పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నది. ఒక మ్యాగజైన్ కు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉండేటువంటి ఫోటోషూట్ చేయడం పలు సంచలనంగా మారింది ఈ విషయం. ఈ టాపిక్ ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా యావత్ భారతదేశమంతా పెను సంచలనంగా మారింది టాప్ హీరో ఇలా ఫోటోషూట్ చేయడం పై సర్వతా చర్చనీయాంశంగా మారుతోంది. కొందరు రణవీర్ కు మద్దతుగా నిలిస్తే మరి కొందరు మాత్రం ఈ హీరోకు నెగిటివ్ కామెంట్లు చేయడం జరుగుతోంది.


రణబీర్ సింగ్ శారీరకంగా నగ్నంగా ఉండడం చాలా సులభం కానీ కొన్ని ప్రదర్శనలో నేను ఇలా మీకు కనిపిస్తాను అని తెలియజేశారు... అంతేకాకుండా నేను ఎంతమందిలో ఉన్నా సరే ఇలా నగ్నంగా ఉండగలను అనే విషయాన్ని తెలియజేస్తూ నాకు ఎలాంటి సిగ్గు బిడియం లేదని.. రణబీర్ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ తీవ్ర చర్చకు దారితీస్తోంది. రణబీర్ సింగ్ ఫోటోషూట్ పై పలువురు నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికి కొంతమంది రోడ్లపైకి వచ్చి రణబీర్ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ముంబైలో రణబీర్ పై పోలీసులుకు ఫిర్యాదు చేయడం జరిగింది ముంబైకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ తో పాటు మరొక మహిళ న్యాయవాది కూడా ఈ విషయంపై పోలీసు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.రణవీర్ న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా మహిళల సెంటిమెంట్లను గాయపరిచారు అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది.. ఐటీ యాక్ట్ కింద 67A తో పాటు 292,293,354,509 సెక్షన్ కింద రణబీర్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో అక్కడ రణవీర్ పై పోలీస్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: