కరోనా సమయంలో థియేటర్ వ్యవస్థ సినీ ఇండస్ట్రీకి చాలా ఎఫెక్టివ్ గా మారిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నట్లు కనిపించిన ఓటీటి కారణంగా ప్రేక్షకులు ఎక్కువగా ఇళ్లలోనే సినిమాలను చూస్తూ ఉన్నారు. ఇక నిర్మాతలు థియేటర్లు యాజమాన్యాలకు చాలా నష్టాలు కలిగాయని చెప్పవచ్చు. ఇలాంటి విషయంలో ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్లో మరింత దిగజారిపోయిందని చెప్పవచ్చు.. బాలీవుడ్ లో చాలా సినిమాలు విడుదలైన అవి అన్ని కూడా హిట్ కాలేక ఫ్లాప్ గా నిలిచాయి. కేవలం ఒక ఏడాదిలో 4 సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయని సమాచారం.

అయితే ఇలాంటి సినిమా బాక్సాఫీస్ వద్ద నిలువలేకపోయింది స్టార్ హీరోలైన రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఏ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ రావట్లేదు. ఇక రీసెంట్ గా విడుదలైన షంషేరా సినిమా కూడా అంతగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. దీంతో ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అర్థం కాక చాలా సతమతమవుతున్నారు దర్శకనిర్మాతలు. ఇక గతంలో సౌత్ సినిమాలను రీమేక్ చేసి మంచి విజయాలను అందుకున్నారు బాలీవుడ్ ఫిలిం మేకర్స్.


కానీ ఇప్పుడు ఇలాంటి ఇవి కూడా వర్కౌట్ కావడం లేదు.. ముఖ్యంగా జెర్సీ, హిట్ వంటి సినిమాలు రీమిక్స్ చేసి బాలీవుడ్ లో విడుదల చేయగా అవి నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్నాయి. ఇక ఇలాంటి సమయంలో చత్రపతి సినిమా రీమిక్స్ తో అలరించడానికి బెల్లంకొండ శ్రీనివాస్ డైరెక్టర్ వివి వినాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరికీ బాలీవుడ్ లో ఇది డబ్ల్యూ చిత్రం. నార్త్ ఆడియన్స్ ని అలరించిన బెల్లంకొండ మొదటిసారి ఇలాంటి సినిమాతో బాలీవుడ్ లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి సమయంలో ఈ సినిమా విడుదల చేస్తే సక్సెస్ అవుతుందా అని అభిమానుల సైతం భావిస్తున్నారు. దీంతో బెల్లంకొండ చాలా రిస్క్ చేస్తున్నాడని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: