ప్రస్తుతం సమంత గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా పేరుపొందాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది అందుకోసం బాలీవుడ్ ,హాలీవుడ్ ఆడియన్స్ను కూడా టార్గెట్ చేస్తూ ఉంది. ఇక వారికోసం ఎక్కువగా స్కిన్ షో నే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇమే వరుసగా గ్లామర్ రోల్స్ పాత్రలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం సమంత నటిస్తున్న శకుంతలం, యశోద, ఖుషి లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇక వీటితోపాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి సమంత ప్రయత్నాలు చేస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే వరుస కథల్ని వింటోంది అన్నట్లుగా సమాచారం.


అయితే బాలీవుడ్లో మ్యాగజైన్ల కోసం విపరీతంగా తన అందాలను ఆరబోత చేస్తు ఉన్నది సమంత. ఇక తన సినిమాలు విషయాని పక్కన పెడితే సమంతకు సంబంధించి తాజాగా ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది ఈ వీడియోలో సమంతని గుర్తుపట్టలేని విధంగా ఉన్నదని చెప్పవచ్చు. అయితే ఈ వీడియో మాత్రం తాజాది కాదు దాదాపుగా 12 సంవత్సరాల క్రితం వీడియో అన్నట్లుగా తెలుస్తోంది. ఏం మాయ చేసావే సినిమా ప్రమోషన్ సమయంలో సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇది అన్నట్లుగా మనకి స్పష్టం అవుతుంది.

గతంలో సమంత తన మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అన్నట్లు ప్రచారం ఎక్కువగా జరిగింది. అయితే ఈ విషయంపై సమంత ఎప్పుడూ కూడా స్పందించలేదు కానీ ఈమె వింటేజ్ పిక్స్ కొన్ని చూస్తే అది నిజమే అన్నట్లుగా మనకి స్పష్టం అవుతుంది.. తాజా వీడియో కూడా అందుకు సింబాలిక్ గానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా సమంత ఎలాంటి విషయం మాట్లాడిన కూడా ఎప్పుడు వైరల్ గానే మారుతూ ఉంటుంది. ఇక గడిచిన కొన్ని రోజుల క్రితం కరణ్ జోహార్ షో లో పాల్గొన్న సమంత అక్కడ కొన్ని విషయాలు చెప్పడంతో మరొకసారి వైరల్ గా మారుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: