ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసినవిషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా తగ్గిన స్పీడ్‌ను కవర్ చేయడానికి మెగాస్టార్ ఫుల్ జోష్ లో షూటింగ్స్ లో పాల్గొంటున్నారు, రీసెంట్ గా ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు..తాజాగా ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ సినిమాను రెడీ చేస్తున్నారు.ఇకపోతే  తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా రాబోతుంది. అయితే ఇక ఈ సినిమాలో స్టార్ హారో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాతో పటు తమిళ్ రీమేక్ వేదాళం సినిమాలో నటిస్తున్నారు చిరు. 

పోతే ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక  ఈ సినిమాకు భోళాశంకర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అంతేకాదు అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఇక పక్క మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అంతేకాదు బాబీ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్.అయితే  ఇక ఈ మూవీలో మాస్ రాజా పాత్ర ఎలాఉంటుందని అభిమానులంతా చర్చించుకుంటున్నారు.

ఇకపోతే ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కోడుతోంది. అయితే  ఇక ఈ సినిమాలో రవితేజ మెగాస్టార్ కు తమ్ముడిగా కనిపించనున్నారట.ఇదిలావుంటే  మెగాస్టార్ సవతి తల్లి కొడుకుగా రవితేజ కనిపించనున్నారట..అంతే కాకుండా ఇద్దరి మధ్య ఓ హైఓల్టేజ్ ఎపిసోడ్ కూడా ఉండనుందని అంటున్నారు. ఇకపోతే గతంలో చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో రవితేజ మెగాస్టార్ తమ్ముడిగా కనిపించి ఆకట్టుకున్నారు.అయితే  ఇప్పుడు మరోసారి మెగాస్టార్ కు తమ్ముడిగా నటించనున్నారని అంటున్నారు.ఇకపోతే మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: