ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో గా కొనసాగుతున్న నాగార్జున 60 ఏళ్ల వయసు దాటి పోతున్న సమయంలో కూడా అమ్మాయిలకు మన్మథుడు గానే కొనసాగుతున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ  యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు నాగార్జున ఈ ఏడాది ప్రారంభంలోనే బంగార్రాజు అనే సినిమాతో కొడుకు నాగచైతన్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు.


 ఈ క్రమంలోనే ఇటీవల నాగార్జున కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అప్పట్లో యువకుడిగా ఉన్న సమయంలోనే నాగార్జున జాతీయ అవార్డు సొంతం చేసుకోవాల్సి ఉందట. సీనియర్ ఎన్టీఆర్ వల్ల ఆ అవార్డు మిస్ అయిందని ఒక టాక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ గీతకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టి తొమ్మిది నెలల సమయం లోనే జాతీయ పార్టీ కాంగ్రెస్ను ఓడించి సీఎం పీఠాన్ని అధిరోహించారు. అప్పట్లో టాలీవుడ్పై అందరిలో కూడా చిన్నచూపు ఉండేది.


 ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పై ఉన్న కోపంతో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగుకు ఇవ్వాల్సిన అవార్డులను సైతం అప్పట్లో ఇవ్వకుండా ఆపేసారు అని డైరెక్టర్ గీతాకృష్ణ చెప్పుకొచ్చారు. తద్వారా సంకీర్తన సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకోవాల్సిన నాగార్జున ఇక సీనియర్ ఎన్టీఆర్ కారణంగా ఇక జాతీయ అవార్డు పొందలేకపోయారు అని చెప్పాలి. ఆ తర్వాత కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న నాగార్జున జాతీయ అవార్డులు మాత్రం దక్కించుకోలేక పోయారు అన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి నాగార్జున ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: