దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మార్చ్  25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని దాదాపు 1100 వందల కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టి సంచలన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటించగా , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అజయ్ దేవ్ గన్ ,  శ్రీయ ,  సముద్ర ఖని ఇతర కీలక పాత్రలో నటించగా ,  ఎం ఎం కీరవాణిమూవీ కి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు.

ఇది ఇలా ఉంటే థియేటర్ లలో  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ వెర్షన్ లు జీ 5 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవ్వగా , హిందీ వెర్షన్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో గత కొద్ది రోజులుగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వర్షన్ లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో కూడా స్ట్రీమింగ్  అవుతున్నాయి. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr