హీరోయిన్స్ అన్నాక అందరూ హీరోలతో నటించి తీరాలి. తమ పాత్ర బాగా ఉండటం మాత్రమే కాకుండా ఏ హీరో సరసన నటిస్తున్నాము అన్న క్లారిటీ కూడా వారికి ఉండాలి. వారు ఏజ్ కి డబల్ ఏజ్ ఉన్న హీరోలతో నటించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారసత్వపు హీరోలు ఎక్కువగా ఉండే సినిమా పరిశ్రమ కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది వారసులే హీరోలుగా వెలుగుతు ఉంటారు. ఆ విధంగా ఇటు తండ్రులు అటు కొడుకులు ఇద్దరు కూడా సినిమా పరిశ్రమలో హీరోలుగా రాణిస్తున్నారు.

అయితే ఇక్కడ చిత్రమేమిటంటే హీరోయిన్లు కొంతమంది ఇటు తండ్రితోనూ అటు కొడుకుతోనూ నటించవలసి వస్తుంది. వారితో రొమాన్స్ చేయవలసి వస్తుంది. అంతేకాదు వారితో ఆడి పాడవలసి కూడా వస్తుంది. అలాంటి విచిత్రమైన సంఘటనలు ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ కాజల్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఆచార్య సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆమె పాత్రను ఈ సినిమాలోంచి తీసేసినా కూడా ఈ సినిమాలో ఆమె నటించిన మాట వాస్తవం. అంతకుముందు ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గ నటించింది అదే సమయంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో కూడా కొన్ని సినిమాలలో ఈమె కలిసి నటించింది. 

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇటు చిరంజీవి మరియు అటు రామ్ చరణ్ తో ఇద్దరితో కలిసి నటించింది. నాగార్జున మరియు నాగచైతన్యలతో కూడా ఆమె కలిసి నటించి ఇద్దరు జనరేషన్ హీరోలను కవర్ చేసింది. వీరే కాదు మెగా హీరోలతో చాలామంది తో ఆమె కలిసి నటించింది.  ఇక లావణ్య త్రిపాఠి కూడా నాగర్జున మరియు నాగచైతన్యలతో కలిసి నటించింది. నాగచైతన్యతో యుద్ధం శరణం అనే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ నాగార్జునతో కలిసి మనం సినిమాలో భాగమయ్యింది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కూడా నాగార్జున సరసన నటించింది. వీరే కాదు గతంలో చాలామంది హీరోయిన్ లు ఈ విధమైన పరిస్థితి నీ ఎదుర్కున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: