ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రెండు సినిమాలకు సంబంధించిన పనులను ఒకేసారి చేస్తూ తన కాల్షీట్ ను ఫుల్ బిజీగా ఉంచుకుంటున్నాడు. ఒకవైపు శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషీ సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొంటూనే ఇంకొక వైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాడు. ఈ విధంగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన పనులను ఒకేసారి చేస్తూ రౌడీ స్టార్ ఫుల్ బిజీగా ముందుకు వెళుతున్నాడు.

చార్మి మరియు కరణ్ జోహార్ నిర్మాతలుగా రూపొందిన ఈ లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యొక్క అప్డేట్లను ఒక్కొక్కటి వదులుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసి  ఎంతగానో ఆసక్తి పరిచిన చిత్ర బృందం ఇక పలు ఈవెంట్ల ద్వారా చిత్రం యొక్క రేంజ్ను పెంచే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల కోసం స్పెషల్ గా తన వంతు సహకారం అందిస్తూనే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా యొక్క షూటింగ్లో పాల్గొంటున్నాడు. సమంత కథానాయకగా నటిస్తున్న ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఈ చిత్రం దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్లో ఎక్కుతున్న సినిమా కావడం విశేషం. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల అవుతుంది ఆ విధంగా ఈ ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. మరి ఆయన సక్సెస్ రుచి చూసి చాలా రోజులే అయిపోయిన నేపథ్యంలో  సినిమా ఆయనకు ఎంతటి విజయాన్ని తీసుకువస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: