ఛాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె తెలుగు ప్రేక్షకులకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన ఛాందిని చౌదరి టాలీవుడ్ లో మెల్ల మెల్లగా హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకుంటుంది. ఇకపోతే ఈమె నటించిన కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు రావడంతో ఒక్కసారిగా ఈ అమ్మడి స్థాయి మరింతగా పెరిగినట్లు అయ్యింది.ఇక తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల తెలుగు లో స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రాకపోవచ్చు.కాగా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు స్టార్ హీరోయిన్స్ అయిన దాఖలాలు లేవు.ఇదిలావుంటే ఛాందిని చౌదరి కూడా ఇక్కడ స్టార్ అవుతాననే నమ్మకంతో లేనట్లుగా ఉంది.

అయితే అందుకే వచ్చిన చిన్న చిన్న ఆఫర్లను మరియు వెబ్ సిరీస్ లను చేస్తూ ఉంది.ఇదిలావుంటే ఇక తాజాగా ఈ అమ్మడికి కోలీవుడ్ లో ఆఫర్ దక్కింది.ఇకపోతే కోలీవుడ్ లో నటించబోతున్నట్లుగా స్వయంగా ఛాందిని చౌదరి అధికారికంగా ప్రకటించింది.కాగా ఛాందిని చౌదరి హీరోయిన్ గా కాకుండా మెయిన్ లీడ్ అన్నట్లుగా తమిళ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.పోతే గతంలో తెలుగు అమ్మాయి అంజలి తో పాటు మరి కొందరు కూడా తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి విజయాలను దక్కించుకున్నారు.

 ఇక అక్కడ స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు దక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి.కాగా అలాంటి కోలీవుడ్ లో ఛాందిని చౌదరి నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఈమె కు మంచి గుర్తింపు దక్కడం ఖాయం అంటున్నారు. పొతే తమిళ ప్రేక్షకులు ప్రతిభ ఆధారంగా ఆదరిస్తారు.. ఇండస్ట్రీ కూడా మంచి నటనతో ఆకట్టుకుంటే వరుసగా ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అయితే అందుకే కోలీవుడ్ లో ఈ అమ్మడు టాప్ స్టార్ గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇకపోతే యూట్యూబ్ ద్వారా ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కానీ ఛాందిని చౌదరి మాత్రమే ఎక్కువ కాలంగా సినిమాల్లో కొనసాగుతూ వస్తుంది. కాగా హీరోయిన్ గా ఈ అమ్మడు ముందు ముందు తెలుగు లో మరిన్ని సూపర్ హిట్స్ ను అందుకుంటుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: