నార్త్ , సౌత్ ఇండస్ట్రీని ప్రస్తుతం ఏలుతున్న ముద్దుగుమ్మ రష్మిక.. టాలీవుడ్,బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాష తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో చాలా స్పీడుగా దూసుకుపోతోంది. చేతినిండా సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారిగా ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడం జరిగింది. ఎప్పటిలాగే తన నవ్వుతో తన స్మైల్ తో ఎక్స్ప్రెషన్ తో ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రెడ్ కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది రష్మిక. అంతేకాకుండా మొదటిసారిగా ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఇలాంటి ర్యాంపు వాక్ చేయడం జరిగింది.


ఇక రష్మీక పోస్ట్ చేస్తూ.. తనని ఇలా అందంగా తయారు చేసి ర్యాంప్ వాక్ చేసేలా చేసిన వ్యక్తికి స్పెషల్ థాంక్యూ చెబుతూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రష్మిక. ఢిల్లీలో మొదటిసారి ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్నప్పుడు తన కడుపులో సీతాకోకచిలుక ఉన్నట్లుగా అనిపించింది అని నేను ప్రోమోడల్ గా నడవడానికి చాలా ప్రయత్నించాను కానీ అది వర్కౌట్ కాలేదు.. అయితే కేవలం నేను నవ్వగలను అదే నా వ్యక్తిత్వం కానీ.. ఇప్పుడు మాత్రం నేను అదరగొట్టానని అనుకుంటున్నట్లుగా తెలియజేసింది. ఇక తను ఒక మోడల్ గా నడిచేందుకు సహాయం చేసిన వరుణ్ కు థాంక్యూ అని తెలియజేసింది.


ఇది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోతుంది.. మీ కల మీ ఫ్యాషన్ ని నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని తెలిపింది. ఇక అంతే కాకుండా మనం కలిసి మరికొన్ని పనులు చేయాలని కూడా కోరుకుంటున్నట్లుగా తెలియజేసింది రష్మిక. ఈ పనిని సరదాగా చేసినందుకు టీమ్ మొత్తానికి ధన్యవాదాలు అంటూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో గుడ్ బై, పుష్ప-2, తదితర చిత్రాలు ఉన్నాయి. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా పేరు పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: