టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నితిన్ తాజాగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నితిన్ సరసన క్యాథరీన్ మరియు కృతి శెట్టి లు హీరోయిన్ లుగా నటించారు. 

మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించ బోతున్నాడు. ఈ మూవీ లో సముద్ర కని ప్రతినాయకుడి పాత్రలో కనిపించగా ,  మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ సినిమా నుండి మూవీ యూనిట్ ఒక్కో  సాంగ్ ను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ రెండు సాంగ్స్ ని విడుదల చేసింది. అందులో ఒకటి అంజలి నటించిన స్పెషల్ సాంగ్ కాగా , మరొకటి నితిన్ , కృతి శెట్టి ల మధ్య సాగే 'అదిరిందే' అనే సాంగ్. ఇది ఇలా ఉంటే తాజాగా అదిరిందే సాంగ్ యూట్యూబ్ లో ఒక రేర్ మార్క్ వ్యూస్ ని సాధించింది.

మహతి స్వర సాగర్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన 'అదిరిందే' సాంగ్ తాజాగా 10 ప్లస్ మిలియన్ వ్యూస్ ని మరియు 150 కే ప్లస్ లైక్ లను సాధించింది. ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ ని అందించగా , సంజీత్ హెగ్డే ఈ పాటలు పాడాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలు , ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినీ ప్రేమికులు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: