చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చాలా సంవత్సరాలుగా స్టార్ హీరోలుగా కొనసాగుతు వచ్చారు. ఈ నలుగురు స్టార్ హీరోలు కూడా 90's నుంచి సినీ పరిశ్రమకు నాలుగు స్తంభాలుగా నిలిచారు. ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీ ఉన్నా కూడా ఈ నలుగురు హీరోలు సినిమాల్లో నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఆరు పదుల వయసులోను యంగ్ హీరోలకు వీరు పోటీ ఇస్తున్నారు. అయితే ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరు టాప్ ర్యాంక్‌లో ఉన్నారు ? అనే విషయం తెలుసుకుందాం.


ఇక చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తమ వయస్సుకు తగ్గట్టు సినిమాలు చేస్తున్నారు. అలా తమ మార్కెట్ పెంచుకుంటూ వారు వెళుతున్నారు. కానీ నాగార్జున మాత్రం తన తోటి ముగ్గురు హీరోల కంటే కూడా వెనుకంజలో ఉన్నాడనే చెప్పాలి. నాగర్జున సినిమాలకు అయితే మినిమం ఓపెనింగ్స్ కూడా లేవు. ఒక్క బంగార్రాజు తప్ప మిగిలిన సినిమాలు ఈమధ్య పెద్దగా అకట్టుకోలేదు. ఆఫీసర్‌, మన్మథుడు 2 లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కత్తి రీమేక్ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రు. 100 కోట్ల షేర్‌ రాబట్టి సత్తా చాటాడు.ఇక సైరా సినిమా ప్టాప్ అయినా రూ.100 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఆచార్య సినిమా మాత్రం చిరంజీవిని పూర్తిగా నిరరాశపరిచింది. కొరటాల శివ లాంటి క్రేజీ డైరెక్టర్‌ ఇంకా రామ్‌చరణ్ ఉండి కూడ ఆచార్య ఇంత భారీ ఫ్లాప్ అవుతుందని ఎవరు అనుకోలేదు. ఆచార్య సినిమా తరువాత చిరంజీవి మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. పైగా చిరంజీవి వరుసగా రీమేక్‌లు చేస్తున్నాడని ఇంకా ఫామ్‌లో లేని డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నాడన్న అపవాదు కూడా ఉంది. 


మెహర్ రమెష్‌, బాబీ ఇంకా మోహనరాజ లాంటి డైరక్టర్లతో సినిమాలు చేయటం చిరు అభిమానులకు కూడా నచ్చటంలేదు.ఇక బాలకృష్ణ అయితే తన కెరియర్ లోనే ఎప్పుడు లేనంత ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఆయన అటు వెండితెరను షేక్ చేస్తూ.. వరసగా క్రేజీ డైరక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఇటు ఆన్ స్టాపబుల్ టాక్ షోతో బుల్లితెరపై తన విశ్వరూపం చూపించి ఈతరం జనరేషన్‌కు బాగా దగ్గరయ్యాడు. అఖండ సినిమా బాలయ్య కెరియర్‌లోనే భారీ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం మలినేని గోపిచంద్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత గోపి చంద్ మలినేనితో,అనిల్ రావిపుడితో, బోయపాటి శ్రీను,పూరీ జగన్నాథ్ వంటి క్రేజీ డైరెక్టర్లతో మంచి లైనప్‌తో బాలయ్య దుసుకుపోతున్నాడు.ఇక బాలయ్య సినిమా వస్తుందంటే చాలు ఇప్పుడు సినీ అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో మామూలు హైప్ ఉండడం లేదు. అలాగే మరో సీనియర్ హీరో వెంకటెష్ తన వయసుకు తగిన సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. ఇటు ఈ తరం హీరోలతో కూడా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ. ప్రయోగాత్మక ఇంకా కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ నలుగురు సీనియర్ హీరోల్లో బాలయ్య నెంబర్ హీరోగా దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: