తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాలలో లైగర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమైన పాత్రలో నటించారు.ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి అభిమానులలో. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాకి నిర్మాతగా కరణ్ జోహార్, చార్మి పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. ఇక ఈ సినిమాని వచ్చే నెల 25వ తేదీన విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం.


సినిమా నుంచి విడుదలైన పలు ట్రైలర్ ,టీజర్స్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఈ అద్భుతమైన రెస్పాన్స్ రావడానికి కారణం విజయ్ దేవరకొండ మేకవర్, రమ్యకృష్ణ డైలాగులు బాగానే ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్లు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. లైగర్ సినిమా నుండి విజయ్ దేవరకొండ ను తెలిపే గ్లింప్స్ టీజర్ ను ఈనెల 29వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చార్మి తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది.


ఇక అంతే కాకుండా షేర్ చేసేటప్పుడు ..#WALL LAGA DENGE అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక పోస్టర్ని షేర్ చేసింది ఇక ఇప్పటికే విడుదలైన.. సాంగ్ కూడా యూట్యూబ్ని షేర్ చేస్తోంది ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పూరి కనెక్ట్ బ్యానర్ పై నిర్మించడం జరుగుతోంది. ఈ సినిమా ఒకేసారి అన్ని భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించనున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నది. ప్రస్తుతం ఛార్మి చేసిన ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: