ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు బుచ్చిబాబు. తొలి సినిమాతోనే ఇంతటి భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు రెండవ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఎంతో సున్నితమైన అంశాన్ని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించి భారీ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు తప్పకుండా భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్ అవుతాడని అందరూ భావిస్తున్నారు. దానికి తగ్గట్లే ఆయన తన రెండవ సినిమా కోసం ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో కోసం ప్రయత్నాలు చేయడం విశేషం.

ఇప్పటికే ఎన్టీఆర్ కు ఆయన కథ చెప్పి ఒప్పించడం జరిగిపోయింది. పెద్ది అనే టైటిల్ ని కూడా నిర్ణయించారు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది అంటున్నారు. అయితే అన్ని ఒకే అనుకున్నాక ఈ సినిమా ముందుకు వెళ్లక పోవడానికి కారణం ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేయాలనుకోవడమే. అందులోనూ పెద్ద దర్శకులతోనూ సినిమా చేయాలనుకోవడం మరి బుచ్చిబాబు ఇప్పటికైనా వేరొక హీరోతో వెళ్లి తన రెండవ సినిమాను అనౌన్స్ చేయాలని చాలామంది కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న రెండు సినిమాల తరువాతనైనా ఆయనతో సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా ఆయన వెల్లడిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని త్వరలోనే మొదలుపెడుతున్న ఎన్టీఆర్ ఆ తరువాత కే జి ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వాలి అంటే వచ్చే ఏడాది కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో అప్పటిదాకా బుచ్చిబాబు ఆగి తన రెండవ సినిమాను ఎన్టీఆర్ తో మొదలుపెడతాడా అనేది చూడాలి.ఈ దర్శకుడి కోసం చాలామంది యువ హీరో లు ఎదురుచూస్తున్న వేళ బుచ్చిబాబు ఈ హీరోలను కాదనడం దేనికి దారి తీస్తుంది చూడాలి.  తొందరగా ఏదోఒక సినిమా మొదలు పెట్టాలని అయన అభిమానులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: