టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన హను రాఘవపూడి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడు హను రాఘవపూడి చివరగా శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన పడి పడి లేచే మనసు అనే ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించాడు. 

సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీ గా మిగిలి పోయింది. ఇది ఇలా ఉంటే పడి పడి లేచే మనసు సినిమా మూవీ బాక్సా ఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని సాధించక పోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే హను రాఘవపూడి తాజాగా సీతా రామం  అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ ,  మృణాళిని ఠాకూర్ హీరో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా ,  భూమిక చావ్లా ,  సుమంత్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ  మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుండి ఈ మూవీ కి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది.

ఈ విషయాన్ని తెలియ జేస్తూ ఈ మూవీ యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ , ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా ఈ మూవీపై ఉన్న అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: