టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య వరుసగా మజిలీ , వెంకీ మామ , లవ్ స్టోరీ , బంగార్రాజు వంటి వరుస విజయాల తర్వాత టాలెంటెడ్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జులై 22 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే  బాక్సా ఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాకు మూవీ యూనిట్ ఆశించిన రేంజ్  కలెక్షన్ లు దక్కడం లేదు.  ఇప్పటి వరకు ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని  కంప్లీట్ చేసుకున్న థాంక్యూ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను గమనించినట్లయితే.

నైజాం : 1.19 కోట్లు ,
సీడెడ్ : 37 లక్షలు ,
యూ ఏ : 62 లక్షలు ,
ఈస్ట్ : 28 లక్షలు ,
వెస్ట్ : 17 లక్షలు ,
గుంటూర్ : 21 లక్షలు ,
కృష్ణ : 24 లక్షలు ,
నెల్లూర్ : 12 లక్షలు .
6 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో థాంక్యూ మూవీ 3.20 కోట్ల షేర్ , 5.48 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 16 లక్షలు .
ఓవర్ సీస్ లో : 85 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజులకు గాను థాంక్యూ మూవీ 4.21 కోట్ల షేర్ , 7.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా ,  దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: