ఇక వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించే అందాల ముద్దుగుమ్మలలో సాయి పల్లవి ఒకరు. టాలీవుడ్ లో ప్రస్తుతం పెద్ద స్టార్ హీరోయిన్ గా సాయి పల్లవి దూసుకుపోతుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ గార్గి.జులై 15 వ తేదీన విడుదలైన ఈ సినిమాపై అందరి నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి యాక్టింగ్‌కు అయితే ఆడియన్స్ తెగ ఫిదా అయిపోయారు.న్యాయం కోసం పోరాడే యువతి క్యారెక్టర్‌లో ఆమె నటించి ఎంతగానో అదరగొట్టేశారు. దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కగా మంచి ఎమోషనల్ హిట్ అయ్యి తమిళ్ లో చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ పై లేటెస్ట్ అప్డేట్ అనేది తెలుస్తుంది.


ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ అయిన సోని లివ్ వారు అన్ని భాషల్లో కొనుగోలు చేయగా ఆగస్ట్ రెండో వారం నుంచి ఇక అందులో స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అనేది రావలసి ఉంది.ఇక ఈ గార్గి చిత్రం ఇప్పటివరకు  దాదాపు 13కోట్లను కలెక్ట్ చేసింది. సాయిపల్లవికి ఉన్న క్రేజ్‌తో ఈ చిత్రానికి 5కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. సాయిపల్లవి మార్కెట్‌కు ఇది చాలా ఎక్కువే అని చెప్పాలి. అయితే ఈ చిత్రం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని ఇప్పుడు లాభాల బాట పట్టింది. ఈ మధ్య చాలా వరకు కూడా సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి.ఈ క్రమంలో సాయిపల్లవి నటించిన గార్గి సినిమా ఈ స్థాయిలో హిట్టయిందంటే విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి విడుదల చేయడం జరిగింది. తెలుగులో కూడా ఈ చిత్రం ఇక కోటీన్నరకు పైగా షేర్‌ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: