ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సినిమాలు ప్రత్యేక సినిమాలుగా ఉంటాయి. ఆ సినిమాలు విడుదలై చాలా సంవత్సరాలు అయినా కానీ ఆ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు ఎవర్ గ్రీన్ సినిమాలుగా నిలిచిపోతాయి.


తెలుగులో విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినిమాలలో మాతృదేవోభవ ఒకటి కాగా ఈ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టని ప్రేక్షకులు దాదాపుగా ఉండరని చెప్పవచ్చు. మాధవి ప్రధాన పాత్రలో కె.అజయ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన ఆకాశదూతు ఆధారంగా తెరకెక్కిందట.


అయితే ఈ సినిమాలన్నీ హూ విల్ లవ్ మై చిల్డ్రన్? మూవీ ఆధారంగా తెరకెక్కాయని చాలామంది కూడా భావిస్తున్నారు. హూ విల్ లవ్ మై చిల్డ్రన్? 1983 సంవత్సరంలో విడుదలైన అమెరికన్ మూవీ కాగా ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.


 


భర్తను కోల్పోయిన మహిళకు క్యాన్సర్ సోకగా తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం ఆ మహిళ పడే తపన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా పాటకు జాతీయ అవార్డ్ కూడా లభించింది. తన మ్యూజిక్ ద్వారా కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పోశారు. 37 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ సమయంలో సినిమా బాగుందనే టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అయితే రాలేదు.


ఆ తర్వాత కేఎస్ రామారావు థియేటర్ల ఓనర్లకు నష్టం వస్తే నాదీ పూచీ అని చెప్పడంతో పాటు టికెట్ తీసుకునే వాళ్లకు కర్చీఫ్ ఫ్రీగా ఇవ్వాలని కూడా సూచించారు. ఆ తర్వాత మౌత్ టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: